KTR Meeting with Industrialists in Hyderabad: రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే.. పారిశ్రామికవేత్తల సమస్యలన్ని తీరుస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఓట్లు కోసం అబద్దం చెప్పట్లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని ఓ హోటల్‌లో పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్(KTR) సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా పారిశ్రామిక వేత్తలు(Industrialists) తమ సమస్యలను తెలిపారు. కొత్త పరిశ్రమలకు ఇచ్చినట్టే పాత కంపెనీలకు రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మాతో పాటు, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రంలో విద్యుత్ తగినంత ఉండటం వల్లే పారిశ్రామిక వృద్ధి సాధ్యమైందని ప్రశంసించారు.
గులాబీల జెండాలే రామక్క - మన రామన్న స్టెప్పేసిండే రామక్క
KTR Comments on Congress: కర్ణాటక నుంచి వచ్చిన ఓ నాయకుడికు స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వకపోవడంతో... తెలంగాణలో 5 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నట్లు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని.. మళ్లీ బీఆర్ఎస్(BRS) అధికారంలోకి వస్తే 24 గంటలు నీళ్లు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మళ్లీ ప్రభుత్వం రాగానే పారిశ్రామిక వేత్తల సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఇండస్ట్రీ పెట్టాలనుకునే వారికి 15 రోజుల్లోనే స్వీయ ధృవీకరణ పత్రాలు ఇస్తున్నామని.. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామిక వేత్తలు తెలంగాణకు వస్తున్నారని అన్నారు.