తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Meeting with GHMC Employees : 'హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన... అప్రమత్తంగా ఉండాలి' - అధికారులతో కేటీఆర్​ సమీక్షా సమావేశం

KTR meeting with Employees : వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. వారాంతం నుంచి హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 5, 2023, 10:19 PM IST

KTR Review Meeting on GHMC Ward Office System: వర్షాకాలం అయినందున అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వారాంతం నుంచి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కోరారు. అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కడికక్కడ అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో భోజన సమావేశాలు ఏర్పాటు చేసుకొని, వారి సేవలకు అభినందనలు తెలుపుతూ, నగర పారిశుద్ధ్యాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా దిశానిర్దేశం చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

KTR Review Meeting with Officials: జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. వార్డులోని సమస్యలపై వారే స్వయంగా వెళ్లి పలువురుతో మాట్లాడరని అధికారులు తెలిపారు. వార్డు కార్యాలయ వ్యవస్థలో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వేగంగా సమస్యలు పరిష్కిరించేందుకు చేస్తున్న ప్రయత్నం పట్ల పౌరులు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

KTR Latest News : 'హైదరాబాద్‌లో త్వరలోనే 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు'

KTR Give Instructions to Employees: వార్డు కార్యాలయాలకు నగర పౌరుల నుంచి స్పందన క్రమంగా పెరుగుతోందని కేటీఆర్ అన్నారు. దీన్ని పెంచేందుకు మరిన్ని కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పారు. వార్డుల పరిధిలో ఉన్న కాలనీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు, ఇతర సంఘాల సహకారంతో కూడా వార్డు కార్యాలయ వ్యవస్థకు మరింత ప్రచారం కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పౌరుల భాగస్వామ్యంతోనే పురపాలక లక్ష్యాలు సాధ్యమవుతాయని... ప్రజలందరు తమ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని అన్నారు.

ప్రజలకి చేరువయ్యేలా కార్యక్రమాల్ని ఏర్పాటు చేయాలి: వార్డు కార్యాలయ వ్యవస్థ ద్వారా ఫిర్యాదులు పెరిగితే దాన్ని సానుకూలంగా చూస్తామని కేటీఆర్ చెప్పారు. వార్డు కార్యాలయ వ్యవస్థ పనిచేస్తుందన్న నమ్మకం పెరుగుతున్న కొద్దీ... ప్రజలు సమస్యలను ఈ వ్యవస్థ ద్వారా పరిష్కరించుకునేందుకు ముందుకు వస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులకు సూచించారు. పౌర సేవలను ప్రజలకు అందించే ప్రక్రియను ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేయాలన్న దిశగా ఈవార్డు కార్యాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నందున ఇంకా ఎక్కడైనా అవసరమైన మార్పులు, చేర్పులు ఉంటే చేసుకొని ముందుకు పోవాలని.. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వివరించారు. ప్రజలకు చేరువచేసే కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details