తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫార్మా రంగ రాజధానిగా హైదరాబాద్​: మంత్రి కేటీఆర్ - KTR MEET GOGGLE CEO latest news

రాష్ట్ర  ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ రెండవరోజు దావోస్‌ పర్యటనలో భాగంగా పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల గురించి చర్చించారు.

ktr
ktr

By

Published : Jan 22, 2020, 8:17 PM IST

Updated : Jan 23, 2020, 12:44 AM IST

దావోస్​లో రెండవ రోజు తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల సీఈవోలు, గ్రూప్‌ ఛైర్మన్లతో పాటు మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారు. హైదరాబాద్​లో గూగుల్‌ కార్యకలాపాలతో పాటు విస్తరణపైన చర్చించారు.

ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కంపెనీ బే సిస్టమ్స్‌ ఛైర్మన్‌ సర్‌ రోజర్‌ కార్‌ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రాష్ట్రంలోని ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల ప్రాధాన్యతను కేటీఆర్‌ తెలియజేశారు. రాక్ వెల్ ఆటోమేషన్ సీఈవో, అధ్యక్షుడు బ్లేక్ డీ మారెట్, కేటీఆర్‌తో భేటీ అయ్యారు. 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జపాన్ ఫార్మా దిగ్గజం టకెడా ఫార్మా వాక్సిన్ బిజినెస్ యూనిట్ అధ్యక్షులు రాజీవ్ వెంకయ్య మంత్రితో సమావేశం అయ్యారు. హైదరాబాద్... ఇండియా లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగ రాజధానిగా ఉందని... తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను కేటీఆర్‌ ఆయనకు వివరించారు.

ఫార్మా రంగ రాజధానిగా హైదరాబాద్​: మంత్రి కేటీఆర్
Last Updated : Jan 23, 2020, 12:44 AM IST

ABOUT THE AUTHOR

...view details