పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. బెంగళూరులోని వస్త్ర పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. వస్త్ర పరిశ్రమల స్థాపనకు.. వ్యాపారానికి రాష్ట్రం ఎంత అనుకూలమో.. మంత్రి కేటీఆర్ వివరించారు.
బెంగళూరులో వస్త్ర పరిశ్రమల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ - minister ktr latest updates
పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. బెంగళూరులోని వస్త్ర పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు.
ఈమధ్యే వరంగల్ టెక్స్టైల్ పార్కుకు కొరియా టెక్స్టైల్ దిగ్గజం యాంగ్వాన్ నుంచి భారీ పెట్టుబడి వచ్చిన రెండు రోజుల్లోనే.. మంత్రి బెంగళూరు వస్త్ర పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమవటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే నాలుగేళ్లలో మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కల్పిస్తామని పలు వేదికలపై మంత్రి పేర్కొనడం వల్ల ఈ పరిశ్రమ విస్తరణకు రాష్ట్రంలో గల అవకాశాలపై మంత్రి చర్చించారు.
ఇవీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం