తెరాస ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతు అయిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నందుకే రాష్ట్రంలో రైతు సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ తెలిపారు. సహకార సంఘాల ఎన్నికల్లో ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లుగా గెలిచిన వారితో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు.
ఖర్చుకు వెనకాడం...
రైతులకు రైతు బీమా, రైతు బంధులాంటి ప్రత్యేక పథకాలను దేశంలోని తొలిసారిగా ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్‌దే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా రైతు సంక్షేమం కోసం ముందుకు వెళ్తున్న ప్రభుత్వం తమదేనని కేటీఆర్ తెలిపారు. రైతులు తమ మీద అపారమైన ప్రేమతో 906 సంఘాల్లో 94 శాతానికి పైగా కట్టపెట్టి అపూర్వమైన విజయాన్ని అందించారని కేటీఆర్ అన్నారు. రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభిచాలని అధికారులకు ముఖ్యమంత్రి అదేశాలు జారీ చేశారని కేటీఆర్ తెలిపారు.