KTR Latest Tweet Today :కల్వకుంట్ల తారకరామా రావు -కేటీఆర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ నేమ్‌కు చాలా పాపులారిటీ ఉంది. కేసీఆర్ తనయుడిగా.. రాజకీయ నేతగా.. మంత్రిగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ తన సత్తా చాటుతున్నారు. కేటీఆర్ తన నియోజకవర్గానికి.. తన శాఖల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక రాజకీయ వేత్తగా కేటీఆర్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆయన పర్సనాలిటీకి అంతకన్నా ఎక్కువ అభిమానులున్నారు. ఆయన మాటతీరు.. కాన్ఫిడెన్స్.. సామాజిక అంశాలపై ఆయనకు ఉన్న పట్టు.. వాటిపై ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ నేటి యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తున్నాయి.
Netizen Praises KTR's Urdu Speaking Skills : ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ప్రజాక్షేత్రంలో బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఆయన సెల్ఫ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ఎక్స్ (ట్విటర్)లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పుడే కాదు.. ఎన్నికలకు ముందు కూడా.. ఆయన ఎక్స్‌లో యాక్టివ్‌గా ఉండేవారు. ఎక్స్ వేదికగా ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. అప్పుడప్పుడు నెటిజన్లతో మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది నెటిజన్లు ఎక్స్ వేదికగా తమ సమస్యలను కేటీఆర్‌కు విన్నవించడమే కాకుండా.. తమకు ఆయనలో నచ్చిన విషయాలేంటో చెబుతూ ఉంటారు. ఆయన చేసిన పనులను ప్రశంసిస్తూ ఉంటారు.
మళ్లీ అధికారంలోకి వస్తే రైతు బంధు కటాఫ్‌ను పరిశీలిస్తాం : కేటీఆర్
KTR Urdu Speaking Skills : తాజాగా ఓ నెటిజన్ కూడా కేటీఆర్‌పై ప్రశంసలు కురిపంచాడు. అయితే ఈ ప్రశంస ఆయన రాజకీయ జీవితం గురించో.. ఆయన సేవాగుణం గురించో కాదు. ఆయన భాషా పరిజ్ఞానం గురించి. కేటీఆర్ గురించి తెలిసిన వారందరికి ఆయన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చాలా అనర్గళంగా మాట్లాడతారని తెలుసు. అయితే తాజాగా ఆయన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉర్దూలో మాట్లాడారు. అది చూసిన ఓ నెటిజన్ కేటీఆర్ ఉర్దూ మాట్లాడాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. " కేటీఆర్ సాబ్.. మీరు ఉర్దూ చాలా బాగా మాట్లాడుతన్నారు. మీ ఉర్దూ చాలా స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంది. మీరు చిన్నప్పుడు ఉర్దూ మీడియంలో చదువుకున్నారా అంటూ ట్వీట్లో కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించాడు.