KTR Comments on E-Commerce : వేగంగా దూసుకుపోతున్న "ఈ-కామర్స్" రంగంలో యువతకు ఉపాధి కల్పనతో పాటు మహిళలకు ప్రాధాన్యం పెంచాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సంగారెడ్డిలో ఫ్లిప్‌కార్ట్ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో వర్చువల్‌గా నిర్వహించారు. ఫ్లిప్‌కార్ట్ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్‌ను ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ఐటీసీ నుంచి ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఈ కామర్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.
KTR at Flipkart Fulfillment Center Launch : ఈ-కామర్స్ రంగం పురోగతి పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి కల్పనలో ఫ్లిప్‌కార్ట్ కృషిని అభినందించారు. ఉపాధి కల్పనలో మహిళలకు 50 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మంది యువతకు ఉపాధి కల్పన జరుగుతోందని అన్నారు. దేశానికే తెలంగాణను రోల్ మోడల్‌గా మారుద్దామని పిలుపునిచ్చారు.
KTR Latest Comments on E-Commerce : రాష్ట్రంలోని ఉపాధి కల్పనతో.. దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ మోడల్ వల్ల రాష్ట్రాన్ని యావత్ దేశం అనుసరిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఈ-కామర్స్ రంగం వేగంగా దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 4 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ కేంద్రంతో.. తెలంగాణలో ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ మరింత పటిష్ఠంగా మారుతుందని తెలిపారు.