తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనసభలో జీహెచ్​ఎంసీ చట్ట సవరణ బిల్లు - Minister ktr on ghmc bill

అసెంబ్లీ సమావేశాలలో పురపాలక మంత్రి కేటీఆర్... జీహెచ్‌ఎంసీ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతోందని తెలిపారు. అందుకు సీఎం కేసీఆర్... నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

జీహెచ్​ఎంసీ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేటీఆర్
జీహెచ్​ఎంసీ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేటీఆర్

By

Published : Oct 13, 2020, 12:14 PM IST

శాసనసభలో చట్టసవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జీహెచ్‌ఎంసీ చట్టసవరణ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టగా... కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ చట్టసవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెట్టారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదిగేందుకు దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. 1955లోనే హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలపాలని గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఆలోచన చేయలేదని కేటీఆర్ ఆరోపించారు.

జీహెచ్​ఎంసీ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేటీఆర్

ఇదీ చూడండి: యాసంగి పంటల విధానంపై నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details