KTR Interesting Comments on TSPSC :తెలంగాణ ఉద్యమ సమయంలో వందల మంది యువత బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌ను పొరపాటున కూడా నమ్మొద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు సోషల్ మీడియాలో పార్టీపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు. సామాజిక మాధ్యమాలను ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
KTR Meeting With BRS Student Wing Leaders : తెలంగాణ ఉద్యమ సమయంలో 10 ఏళ్లు ఉన్న పిల్లలకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందని.. వారికి రాష్ట్ర ఏర్పాటుకు ముందు పరిస్థితిని, ప్రస్తుత అభివృద్ధిని వివరించాలని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేసింది బండి సంజయ్ (Bandi Sanjay), ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కాదా అని ప్రశ్నించారు. రద్దు చేస్తే గొడవ చేసింది కూడా వాళ్లే కదా? అని అన్నారు. కోర్టులో కేసు వేసి గ్రూప్-2 రద్దు చేయించారని ఆరోపించారు. కడుపులో గుద్ది.. నోట్లో పిప్పరమెంటు పెడతారని కేటీఆర్ విమర్శించారు.
KTR On TSPSC Issue :కొన్ని చోట్ల తప్పులు జరిగాయని.. అది తాను ఒప్పుకొంటానని కేటీఆర్ తెలిపారు. డిసెంబరు 3 తర్వాత టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయటానికి తానే బాధ్యత తీసుకుంటానని హమీ ఇచ్చారు. మొన్న అమిత్ షా (Amit Shah) వచ్చి బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. సేద్యానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తమ రాష్ట్రంలో 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడంలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
KTR Meeting with Students : 'తెలంగాణ సాధించిన ప్రగతిని.. ప్రజల్లోకి తీసుకెళ్లాలి'