మెట్రో, ఆర్టీసీ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచనలు - minister ajay
మెట్రో, ఆర్టీసీ అధికారులకు రాష్ట్ర పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. కరోనా (కొవిడ్-19) వైరస్ దృష్ట్యా బెంగళూరు తరహాలో హైదరాబాద్ మెట్రోరైలుతోపాటు ఆర్టీసీలోనూ చర్యలు చేపట్టాలని కేటీఆర్ ట్విట్టర్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరారు.

మెట్రో, ఆర్టీసీ అధికారులకు కేటీఆర్ సూచనలు
కరోనా వైరస్ దృష్ట్యా హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ అధికారులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. బెంగళూరులో మెట్రోరైలు,ఆర్టీసీ బస్సులను అధికారులు ప్రత్యేకంగా శుభ్రం చేస్తున్నారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీలోనూ చర్యలు చేపట్టాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీకి తగు సూచనలు చేయాలంటూ కేటీఆర్ ట్విట్టర్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరారు.