KTR Instructions to BRS Leaders on TSRTC : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు కోరారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం కేసీఆర్ పాలనలో మానవీయతకు నిదర్శనమన్నారు.
Celebrations In Front of All BUS Depos Telangana: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సు డిపోల ముందర ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో వీఆర్ఏ, ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు కేటీఆర్ సూచించారు. కేవలం ఉద్యోగుల పట్లనే కాకుండా అనాథలందరినీ ఒక పాలసీ కిందకు తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయమని కేటీఆర్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సంతోషించతగ్గ విషయమని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రస్తుతం నెరవేరుతున్నందన సంబరాలు ప్రతి నియోజక వర్గంలో చేయాలని సూచించారు. రాష్ట్ర రాజధానిలో ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికను రూపొందించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు.