హైదరాబాద్ పంజాగుట్టలో రూ.23 కోట్లతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
మేయర్ బొంతు రామ్మోహన్, శాసన సభ్యుడు దానం నాగేందర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్‌లతో కలిసి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. రోడ్డు విస్తరించి.. నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను కేటీఆర్ పరిశీలించారు. లాక్‌డౌన్ వలన కలిగిన వెసులుబాటుతో కార్మికులు, నిపుణులను అదనంగా నియమించి పనులు చేయిస్తున్న గుత్తేదారును మంత్రి అభినందించారు. తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ.. నెలరోజుల్లో పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.