తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: కేటీఆర్ - minister ktr latest news

తెలంగాణ చరిత్ర, ఉద్యమ సాహిత్యం, రాష్ట్రాభివృద్ధి, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన పుస్తకాలతో తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

Ktr inaugurates library in party office
తెరాస పార్టీ కార్యాలయంలో గ్రంథాలయం ప్రారంభం

By

Published : Dec 12, 2019, 5:54 PM IST

తెరాస కార్యకర్తలంతా.. సమకాలీన అంశాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ సాహిత్యం, రాష్ట్రాభివృద్ధి, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన పుస్తకాలతో పార్టీ కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేశారు.

మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము చెక్కులను పార్టీ కార్యాలయంలో కేటీఆర్ పంపిణీ చేశారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుదని హామి ఇచ్చారు.

తెరాస పార్టీ కార్యాలయంలో గ్రంథాలయం ప్రారంభం

ఇవీ చూడండి: కోట వైభవం భళా... సౌకర్యాలకై విలవిల

ABOUT THE AUTHOR

...view details