మేకిన్ ఇండియా, మేకిన్ తెలంగాణలో భాగంగా పరిశ్రమలు వస్తున్నాయని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చిన పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. పారిశ్రామిక విధానాలు కార్మికులకు మేలు చేసేలా ఉండాలని సీఎం ఎప్పుడూ చెప్తుంటారని గుర్తు చేశారు. జీతాలు పెంచమని అడిగిన అంగన్వాడీ వర్కర్లను గత పాలకులు గుర్రాలతో తొక్కించారని... సీఎం కేసీఆర్ మాత్రం రెండు సార్లు జీతాలు పెంచారని అన్నారు. ప్రగతిభవన్‌లోకి సామాన్యులకు అనుమతి లేదనేది అబద్ధమని వెల్లడించారు.సీఎంకేసీఆర్ అన్ని వర్గాలప్రతినిధులను ప్రగతిభవన్‌కుపిలిపించుకుని భోజనాలు పెట్టి మరీ సమస్యలపై చర్చిస్తున్నారని తెలిపారు.
ప్రగతిభవన్‌లోకి అనుమతి లేదనేది అబద్ధం: కేటీఆర్ - TRS
రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయని... అందులో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా కృషి చేస్తామని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మేడే వేడుకల్లో పాల్గొన్న ఆయన... ప్రగతిభవన్‌లోకి సామాన్యులకు అనుమతి లేదనేది అబద్ధమని తెలిపారు.
సామాన్యులకు అనుమతి లేదనేది అబద్ధం: కేటీఆర్