రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, కొవిడ్ అనంతర అవకాశాలపై భారతీయ పరిశ్రమల సమాఖ్య ఓ భారీ వర్చువల్ సదస్సు ప్రదర్శనను ప్రారంభించింది. 90 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ప్రణాళికను కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సీఐఐ కీలకపాత్ర పోషిస్తోందని.. తెలంగాణ రాష్ట్రం బిజినెస్ ఎకోసిస్టం, వనరులు, రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతల ప్రదర్శనకు... ఈ సదస్సు దోహదపడుతుందని.. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.