ట్విట్టర్ వేదికగా సమస్యల్ని పరిష్కరించడంలో కేటీఆర్ దిట్ట. జగిత్యాల జిల్లా తాండ్రియాల గ్రామానికి చెందిన రుద్రరచన చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోయింది. ఈసెట్‌లో మంచి ర్యాంకు సాధించి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించింది. ఫీజు కట్టే స్తోమత లేకపోవడం వల్ల రచన పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకుని రుసుములకు కావాల్సిన అర్థిక సహాయాన్ని అందజేశారు. తనలాగే అనేకమంది విద్యావంతులైన అనాథలు రాష్ట్రంలో ఉన్నారని.... వారి కోసం ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని రచన కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని కేటీఆర్ హమీ ఇచ్చారు. ప్రస్తుతం రచన బాగోగులు చూసుకుంటున్న ఆమె అక్క బావలకి అవసరమైన ఉపాధి కల్పించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్‌కి కేటీఆర్ ఫోన్ ద్వారా సూచించారు.
మరో విద్యార్థినికి కూడా...