పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. జాతీయ జీఎస్డీపీ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. జాతీయ జీడీపీలో రాష్ట్ర వాటా గత ఏడాది నమోదైన 4.55 శాతంతో పోలిస్తే 2019- 20 సంవత్సరానికి 4.76 శాతంగా నమోదైంది. తలసరి ఆదాయం విషయంలోనూ... జాతీయ సగటు రూ.1, 34, 432తో పోల్చినప్పుడు ఆదాయం రూ. 2,28,216గా నమోదైంది.
తెలంగాణ వార్షిక వృద్ధిరేటు 8.2 శాతం.. నివేదిక విడుదల చేసిన కేటీఆర్ - వార్షిక ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్
హైదరాబాద్లో మంత్రి కేటీఆర్... పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేశారు. జాతీయ జీడీపీలో రాష్ట్ర వాటా గత ఏడాదితో పోలిస్తే 2019- 20 సంవత్సరానికి 4.76 శాతంగా నమోదైంది.
దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగింది. ఇప్పటి దాకా టీఎస్ ఐపాస్ ద్వారా వచ్చిన పెట్టుబడుల మొత్తం రూ. 1,96,404 కోట్లు కాగా... ఇప్పటిదాకా అనుమతులు పొందిన 12,021 పరిశ్రమల్లో 75 శాతానికి పైగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. భారత్లోనే అత్యధికంగా నెట్ ఆఫీస్ అబ్సార్ప్క్షన్ విషయంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 35 శాతంగా ఉంది.
ఇవీ చూడండి:సిరిసిల్లను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం:కేటీఆర్