హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబర్‌పేట్, గోల్నాకా తదితర ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నైట్ షెల్టర్లతో పాటు అక్కడ ఉన్న ఏర్పాట్లను పరిశీలించారు.
కరోనాపై యుద్ధం... రంగంలోకి మంత్రి కేటీఆర్ - కేటీఆర్
కరోనాపై కేంద్రం యుద్ధాన్ని ప్రకటించింది. కేసీఆర్ మరో అడుగు ముందుకేసి రాత్రివేళలో కర్ఫ్యూ విధించారు. ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. వెంటనే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయిలోకి దిగారు.
KTR VISITED some places in Hyderabad
నైట్ షెల్టర్లలోని మహిళలకు రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు పరిశుభ్రతతోపాటు ఇంటి నుంచి బయటకు రాకుండా క్రమశిక్షణ పాటించాలని కేటీఆర్ సూచించారు.
Last Updated : Mar 25, 2020, 6:11 PM IST