KTR Tweet: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఎప్పుడూ ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే మంత్రి... ఈసారి కూడా కేంద్రంపై తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. గ్యాస్ వెయ్యి అయ్యింది... పేదలకు కట్టెలపొయ్యి దిక్కయ్యిందని ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. పేదోడి పొట్ట కొడుతున్నారు.. చేతిలో పొగగొట్టం పెడుతున్నారని పేర్కొన్నారు. మహిళలకు అర్థమైంది, మోయలేని భారం మోపే వారే, మోదీ అని.. అంటూ పోస్ట్ చేశారు.
ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం... ఆడబిడ్డలపై ఆర్థిక భారమా? అని ప్రశ్నించారు. మోదీ పాలనలో ధరలు ఆకాశంలో.. ఆదాయాలు పాతాళంలో.. అని వెల్లడించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంట.. సామాన్యుల గుండెల్లో గ్యాస్ మంట అంటూ రాసుకొచ్చారు.
''ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప... ఆడబిడ్డల కష్టాలు కనిపించవా?
గరీబోల్ల గుండెలపై మోయలేని.. గుదిబండలు ఈ గ్యాస్ బండలు!
గ్యాస్ వెయ్యి అయ్యింది.. పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యింది!