kTR Fires On BJP: కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారని.. కానీ ఇప్పుడు ఎందుకు నిరాకరిస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై ఎంపీలు లేదా కేంద్ర మంత్రులు ఎవరైనా సమాధానం చెప్పాలని నిలదీశారు. అసోం విషయంలో సంతోషంగా ఉన్నాను కానీ.. తెలంగాణలో వెన్నెముక లేని బీజేపీ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని మండిపడ్డారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వేములవాడకు రూ.100 కోట్లు ఇస్తానని కేసీఆర్ అన్నారని బండి సంజయ్ గుర్తు చేశారు. తీగలగుట్టపల్లి రైల్వే వంతెనకు రాష్ట్ర వాటా ఇవ్వాలని తెలిపారు. రూ.80 కోట్లు ఇస్తే పనులు వెంటనే ప్రారంభం అవుతాయని అన్నారు. గంగాధర రైల్వే పైవంతెనకూ నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ కోసం చాలా చేస్తామని చెప్పారని.. అవన్నీ హామీలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు.