తెలంగాణ

telangana

ETV Bharat / state

"భయమెందుకు బాబు" - TDP

ఐటీ గ్రిడ్స్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరుస ట్వీట్లతో తనదైన శైలిలో చురకలంటించారు.

"భయమెందుకు బాబు"

By

Published : Mar 5, 2019, 1:32 PM IST

Updated : Mar 5, 2019, 3:32 PM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ఘాటైన విమర్శలు చేశారు. ఐటీ గ్రిడ్స్ కేసుపై ఆరోపణలు చేస్తూ నాలుగు వరుస ట్వీట్లు చేశారు. "మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు" అంటూ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఎందుకు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. అనవసరంగా కోర్టులో తప్పుడు పిటిషన్లు పెట్టడమెందుకని ట్వీట్ లో విమర్శలు చేశారు. "విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుందనే ఇలా చేస్తున్నారా చంద్రబాబు గారు" అంటూ చురకంటించారు.

ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోపంగ్యా ఉంచాల్సింది పోయి ఈ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ ప్రైవేటు సంస్థకు చేరవేయడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవడమేనన్నారు. దొంగల్ని పట్టుకోవడానికి వచ్చిన వారినే దొంగలని ముద్రిస్తున్నారంటూ మండిపడ్డారు.

Last Updated : Mar 5, 2019, 3:32 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details