KTR Fires at Central Government :చేనేత కార్మికులకు మరింత చేయూతనిచ్చేలా కొన్ని కొత్త పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలు చేస్తున్నట్లు చేనేత శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రూ.40 కోట్లతో 10,652 ఫ్రేమ్ మగ్గాలు అందుబాటులోకి తెస్తామన్నారు. చేనేత, అనుబంధ కార్మికులకు.. గుర్తింపు కార్డులు ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు ఓపీ- సేవలు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
Handloom Entrepreneur : కష్టపడితే కానిదేముందని నిరూపిస్తున్న మహిళ
KTR on Handloom :జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మన్నెగూడలో పలువురు నేత కళాకారులకు.. కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలను కేటీఆర్ (KTR participated in National Handloom Day) అందించారు. చేనేత రంగానికి డీసీసీబీ, టెస్కాబ్ ద్వారా రూ.200 కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. చేనేత కార్మికులు ఇంటి వద్ద షెడ్ నిర్మించుకునేందుకు సాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. చేనేత మిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ.3,000 ఇస్తామని చెప్పారు. ఈ పథకాన్ని ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామని కేటీఆర్ వివరించారు.
KTR Fires at Central Government GST on Handloom :ఈ క్రమంలోనే 59 ఏళ్ల నుంచి 75 సంవత్సరాలలోపు చేనేత కార్మికులకు.. రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం కల్పిస్తుందని కేటీఆర్ ప్రకటించారు. మృతి చెందిన నేత కార్మికుల కుటుంబానికి టెస్కో సాయం రూ.25,000కు పెంచుతున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులపై కేంద్రం వివక్ష చూపిస్తోందని విమర్శించారు. చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిన నేత నరేంద్ర మోదీపై ఆయన ధ్వజమెత్తారు. 'చేనేత వద్దు.. అన్నీ రద్దు' అనేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనన్న మంత్రి .. ఆ సర్కార్‌లో బీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉండబోతోందని జోస్యం చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రోత్సహించాలని కేటీఆర్ కోరారు.