తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేటర్​ దంపతులకు జరిమానా వేసిన కేటీఆర్... ఎందుకంటే..? - ఎర్రగడ్డ కార్పొరేటర్​

హైదరాబాద్​ ఎర్రగడ్డ కార్పొరేటర్​ దంపతులకు మంత్రి కేటీఆర్​ భారీగానే జరిమానా వేశారు. అసలు వాళ్లిద్దరు మంత్రికి ఆగ్రహం తెప్పించేలా ఏం చేశారంటే...?

Fine for the corporator couple
కార్పొరేటర్​ దంపతులకు జరిమానా వేసిన కేటీఆర్... ఎందుకంటే..?

By

Published : May 22, 2020, 2:14 PM IST

హైదరాబాద్​ ఎర్రగడ్డ కార్పొరేటర్​ దంపతులకు జరిమానా విధించాలని మంత్రి కేటీఆర్​ ఆదేశించారు. కార్పొరేటర్‌ షాహిన్‌బేగం, భర్త షరీఫ్‌కు జరిమానా పడింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెట్టినందుకు కార్పొరేటర్‌కు రూ.20 వేలు, మాస్కు లేకుండా వచ్చినందుకు కార్పొరేటర్ భర్త షరీఫ్‌కు వెయ్యి రూపాయల ఫైన్​ వేశారు.

వారిద్దరికీ జరిమానా విధించాలని జీహెచ్​ఎంసీ అధికారులను కేటీఆర్​ ఆదేశించారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌లో బస్తీ దవాఖానా ప్రారంభోత్సవంలో కేటీఆర్​... వారికి జరిమానా వేశారు.

ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక

ABOUT THE AUTHOR

...view details