KTR Counter To Rahul Gandhi: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ లక్ష్యాలపై రాహుల్ గాంధీ స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందని మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. రాహుల్ గాంధీకి ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చిన మంత్రి... అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ కనీసం తన సొంత నియోజకవర్గం అమేథీలో గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. అటువంటి వ్యక్తి సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రధాని కావాలనుకునే వారు ముందు.. ఎంపీ అయ్యేలా తమ ప్రజల్లో నమ్మకం కలిగించుకోవాలని రాహుల్‌కు కేటీఆర్ సూచించారు.
అసలేం జరిగిదంటే:నిన్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా..కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస విధానాలను ఎండగట్టారు. భాజపా, తెరాస రెండు పార్టీలూ ఒకే విధానాన్ని అవలంభిస్తున్నాయని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్‌పైనా రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొంతమంది ఎవరికి వారే తమది పెద్ద పార్టీగా ఊహించుకుంటున్నారని.. అంతర్జాతీయ పార్టీగా ప్రకటించుకొని అమెరికా, చైనాలోనూ పోటీ చేయవచ్చని రాహుల్ ఎద్దేవా చేశారు.