KTR Counter to Karnataka CM Siddaramaiah : డిసెంబర్ తొమ్మిదో తేదీలోపు నెరవేరుస్తామన్న కాంగ్రెస్ గ్యారంటీల(Congress Six Guarantees) పరిస్థితి ఏంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హామీలు నకిలీవని, హామీలు ఇచ్చిన వారూ నకిలీ నేతలని విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్‌కు ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ప్రజలను మోసగించేలా అబద్ధపు హామీలు ఇవ్వడం వల్లే తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందని కేటీఆర్(KTR) ఆరోపించారు.
KTR Siddaramaiah Tweet War : అంతకుముందు 'తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా? ఎందుకంటే మీకు ఏది ఫేక్, అలాగే ఏది ఎడిట్ చేయబడింది, ఏది నిజం, దానిని ఎలా ధ్రువీకరించాలో కూడా తెలియదు. బీజేపీ నకిలీ, ఎడిట్ చేసిన వీడియోలను సృష్టిస్తుంది. వాటిని మీ పార్టీ ప్రచారం చేస్తుంది. మీ పార్టీ బీజేపీకి బీ టీమ్ అనడానికి ఇంకా ఏం ప్రూఫ్ కావాలి' అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
MLA KTR Fires on Congress Party : ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు డిసెంబరు తొమ్మిదో తేదీ నాటికి నెరవేరుస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీల సంగతి ఏమిటని ప్రశ్నించారు. రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న రైతు భరోసా(Rythu Barosha) ఎక్కడకు పోయిందని ధ్వజమెత్తారు. రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ ఏమైందని అడిగారు. రూ.4000 ఆసరా పింఛన్ ఏమైందన్నారు. అలాగే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అన్న మాట ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు.
టార్గెట్ 2024 - పక్కా ప్రణాళికతో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్