తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేటీఆర్ నోరు జాగ్రత్త' - CONGRESS SENIOR LEADER VH

లోక్​సభ ఎన్నికల సన్నాహక సభల్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది.

మోదీకి మద్దతు ఇచ్చేందుకే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ : వి.హెచ్

By

Published : Mar 9, 2019, 5:44 AM IST

Updated : Mar 9, 2019, 7:53 AM IST

పార్లమెంటు ఎన్నికల్లో తెరాస వైఖరేంటో చెప్పి ఓట్లు అడగాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ అమలు చేసిన ప్రభుత్వం తమదేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హెచ్ తెలిపారు. మోదీకి మద్దతు ఇచ్చేందుకే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో రాష్ట్రాల పర్యటన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎక్కువ మంది ఎంపీలున్న తెరాస విభజన హామీలను ఎందుకు నెరవేర్చుకోలేకపోయిందని ప్రశ్నించారు. హరిత విప్లవం ద్వారా దేశంలో ఆహార కొరత లేకుండా చేశామని సీనియర్‌ నేత మల్లు రవి పేర్కొన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో తెరాస వైఖరేంటో చెప్పి ఓట్లు అడగాలి : కాంగ్రెస్‌

ఇవీ చదవండి :130 కోట్ల మంది ప్రజలే సాక్ష్యం

Last Updated : Mar 9, 2019, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details