2018-19 సంవత్సరానికి హైదరాబాద్లో ఐటీ రంగ పనితీరు బాగుందని మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం 17 శాతం వృద్ధిని నమోదు చేసి.. లక్షా 9 వేల 219 కోట్ల ఆదాయాన్ని... ఉపాధిలో 14.2 శాతం పెరుగుదలను నమోదు చేసిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన ఐటీ ఉద్యోగులు, ఉన్నతాధికారులకు అభినందనలు తెలియజేశారు. ఐదేళ్ల క్రితం ఐటీ ఎగుమతుల విలువను రెండింతలు చేయాలన్న లక్ష్యాన్ని అందుకున్నామని తెలిపారు.
'2019లో ఐటీ పురోగతి భేష్... 17 శాతం వృద్ధి' - ఐటీపై కేటీఆర్ హర్షం
గతంతో పోలిస్తే హైదరాబాద్లో ఐటీ రంగ పనితీరు భేషుగ్గా ఉందని మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎగుమతుల్లో రాష్ట్రం 17 శాతం వృద్ధిని నమోదు చేసిందని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
ఐటీ పురోగతి