KTR Today Tweet : కొవిడ్‌పై పోరులో హైదరాబాద్ మరోసారి ముందంజలో ఉందని.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ఐనోవాక్‌కు అనుమతులు పొందినందుకు భారత్ బయోటెక్ అధిపతులు కృష్ణ ఎల్ల, సుచిత్రా ఎల్లకు అభినందనలు తెలియజేశారు. ఐనోవాక్.. ప్రపంచంలోనే మొదటి ఇంట్రా నాజల్ వ్యాక్సిన్ అని మంత్రి కొనియాడారు. ప్రపంచానికి అవసరమైన టీకాలను జీనోమ్ వ్యాలీలో.. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారు చేయడం గర్వకారణం అని ప్రశంసించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
కొవిడ్‌పై పోరులో మరోమారు ముందంజలో హైదరాబాద్: కేటీఆర్ - Suchitra Ella Krishna Ella Congratulations KTR
KTR Today Tweet : కరోనాపై పోరులో హైదరాబాద్ ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ఐనోవాక్‌కు అనుమతులు పొందిన భారత్ బయోటెక్ సంస్థను ఆయన అభినందించారు.
KTR