తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Vs Revanth Reddy : 'తెలంగాణలో కాంగ్రెస్​ని.. ఓ పోకిరి చేతుల్లో పెట్టారు' - తెలంగాణ కాంగ్రెస్​

KTR Fire On Revanth Reddy Comments : బీఆర్​ఎస్​, కేసీఆర్​, కేటీఆర్​లపై విమర్శలు చేసిన రేవంత్​ రెడ్డిపై మంత్రి కేటీఆర్​ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ పార్టీని స్కాంగ్రెస్​గా పార్టీగా అభివర్ణించారు. బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడే వ్యక్తికి పార్టీని అప్పగించారని కాంగ్రెస్​పై సానుభూతి ప్రకటించారు.

KTR
KTR

By

Published : Jul 14, 2023, 3:38 PM IST

KTR Comments On Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్​ని ఓ పోకిరి చేతుల్లో పెట్టారని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీని స్కాంగ్రెస్​గా అభివర్ణించిన కేటీఆర్​.. బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడే వ్యక్తికి పార్టీని అప్పగించడం బాధాకరమని అన్నారు. హైదరాబాద్​లో జరిగిన ఓ సమావేశంలో ఈ విధంగా విమర్శలు చేశారు.

Minister KTR Fire On Revanth Reddy : అలాగే కాంగ్రెస్​ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అనుచరులమంటూ గత రాత్రి సుమారు 12:15 గంటల సమయంలో కొందరు తనకు కాల్​ చేసి బెదిరించినట్లు బీఆర్​ఎస్​ నేత దాసోజు శ్రవణ్​ ట్విటర్​ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ బెదిరింపులకు పాల్పడిన వారిపై సైబర్​ క్రైం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. దాసోజు శ్రవణ్​ చేసిన ట్వీట్​పై మంత్రి కేటీఆర్​ స్పందించారు. ఆ ట్వీట్​ను హోంమంత్రి మహమూద్​ అలీ, తెలంగాణ డీజీపీని ట్విటర్​ ద్వారా సంఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వాటిని తీవ్రంగా పరిగణించి.. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

కేటీఆర్​ Vs రేవంత్​ రెడ్డి : గురువారం గాంధీభవన్​లో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్​ రెడ్డి బీఆర్​ఎస్​, కేసీఆర్​, కేటీఆర్​లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉచిత విద్యుత్​పై తాను వేర్వేరుగా మాట్లాడిన మాటలను వక్రీకరించి.. కేటీఆర్​ టీం ఎడిట్​ చేసి తప్పుదారి పట్టించిందని రేవంత్​ రెడ్డి పరుషజాలంతో విమర్శలు చేశారు. అంతకు ముందు అమెరికాలో రేవంత్​ ఉచిత విద్యుత్​పై చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రవ్యాప్తంగా మంత్రి కేటీఆర్​ నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మూడు గంటల విద్యుత్​ను ఇచ్చే కాంగ్రెస్​ లాంటి రాబందు కావాలో.. లేక మూడు పంటలు పండిస్తున్న కేటీఆర్​ కావాలనో మీరే తేల్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్​ నుంచి రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక వెలువడిందని అన్నారు. అందుకే కాంగ్రెస్​ను ఓడించాలని తెలంగాణ ప్రజానికాన్ని కోరారు.

Revanth Reddy Comments On KCR : అందుకు కౌంటర్​గా రేవంత్​ రెడ్డి ఉచితం అబద్ధం.. అవినీతి నిజం అని బీఆర్​ఎస్​ను ఉద్దేశించి మాట్లాడారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్​నే.. ఉచిత విద్యుత్​ ఇవ్వడం కుదరదని నాటి ప్రభుత్వానికి తేల్చి చెప్పారన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్​ 24 గంటల ఉచిత విద్యుత్​ పేరు చెప్పి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్​ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని గతంలో కేసీఆర్​ చెప్పారు. తక్కువ రేటుకే కేంద్రం ఇస్తామంటే వద్దని చెప్పి.. రూ.45వేల కోట్లను అప్పుగా చేసి ఇప్పుడు విద్యుత్​ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details