KTR Challenge to Telangana Congress Leaders : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజుపై.. తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. దివాలా తీసిన సంస్థకు ఓఆర్ఆర్ నిర్వహణను అతి తక్కువ మొత్తానికి 30 ఏళ్లకు కట్టబెట్టారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లోనూ అదే సంస్థకు టోల్ వసూలు లీజు ఇచ్చారని చెప్పారు. అక్కడ కూడా అవినీతి జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టోల్ లీజు వ్యవహారంలో అవినీతినినిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు.
KTR Sensational Comments on Congress and BJP : దేశంలో ఇప్పుడు చాయ్ పే చర్చ కాదు.. సిలిండర్, నిత్యావసర ధరలపై చర్చ జరుగుతోందని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమ కంటే ఉత్తమ పాలన ఉందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. పొరపాటున కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే ఒక మాట ఇవ్వాలన్నా.. ఒక పని చేయలన్నా.. చివరకు బాత్రూంకు పోవాలన్నా.. చలో దిల్లీ అంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు దిల్లీ వదిలిన బాణాలన్న ఆయన.. తమ నాయకుడు కేసీఆర్.. ప్రజలు వదిలిన బ్రహ్మాస్త్రం అని అన్నారు.
'కాంగ్రెస్ అంటేనే అంధకారం. పీసీసీ అధ్యక్షుడు ఏది మాట్లాడినా రూ.వేల కోట్ల కుంభకోణం అంటారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్‌టీఐ కొందరికి రూట్ టు ఇన్‌కం. రేవంత్ మాటలు సంస్కారం ఉన్న నాయకుని మాటలా? 70 ఏళ్లు ఉండి.. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ను ఉరి వేసి రాళ్లతో కొట్టమంటారా? ఐఏఎస్ అధికారులను పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? పరువు నష్టం దావాతో మీ అధ్యక్షుడి అంతు చూస్తాం. ఐఆర్‌బీ సంస్థ రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర చోట్ల కూడా ఇదే తరహాలో లీజు తీసుకుంది. అక్కడ కూడా కుంభకోణాలు జరిగాయా? ఓఆర్‌ఆర్ యాజమాన్య హక్కులు వదులుకోవడం లేదు. 30 ఏళ్ల తర్వాత భట్టి ముఖ్యమంత్రిగా ఉంటారేమో?ఓఆర్‌ఆర్ టెండర్ల వ్యవహారంలో తప్పు చేసినట్లు నిరూపిస్తే మళ్లీ ఏ పదవీ తీసుకోను. రాజకీయ సన్యాసం తీసుకుంటా.'-కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి