తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా కాదు.. 'భారతీయ జనా ఈసీ-సీబీఐ-ఎన్‌ఐఏ-ఐటీ-ఈడీ పార్టీ' - తెలంగాణ తాజా రాజకీయాలు

KTR fire on BJP: ఎలక్షన్ కమిషన్ కంటే ముందే భాజపా ఎన్నికల తేదీని ప్రకటిస్తుందని, ఈడీ కంటే ముందే సోదాలు చేసే వారి పేర్లు భాజపా వెల్లడిస్తోందని.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్​ వేదికగా భాజపా స్టీరింగ్ కమిటీ భేటీపై వ్యంగ్యంగా ట్వీట్​ చేశారు.

KTR fire
KTR fire

By

Published : Oct 2, 2022, 1:21 PM IST

KTR fire on BJP steering committee: మునుగోడు ఉపఎన్నికపై భాజపా స్టీరింగ్ కమిటీ భేటీపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ఘాటు విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక 15లోపు వస్తుందని.. 5అంచెల వ్యూహంతో భాజపా విజయం సాధించాలని భాజపా స్టీరింగ్ కమిటీ భేటిలో ఆపార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.

ఎలక్షన్ కమిషన్ కంటే ముందే భాజపా ఎన్నికల తేదీని ప్రకటిస్తుందని, ఈడీ కంటే ముందే సోదాలు చేసే వారి పేర్లు వెల్లడిస్తుందని, ఎన్‌ఐఏ కంటే ముందే బ్యాన్ విధిస్తుందని, ఐటీ అధికారుల కంటే ముందే నగదు వివరాలు భాజపా చెబుతుందని, సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లు భాజపా ప్రకటిస్తోందని.. ఆయన ట్విటర్​లో తనదైన శైలీలో విమర్శించారు. అసలు భారతీయ జనతా పార్టీని "భారతీయ జనా ఈసీ-సీబీఐ-ఎన్‌ఐఏ-ఐటీ-ఈడీ పార్టీగా" పేరు మార్చుకోవాలని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details