ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ టీఎన్న్జీవో కేంద్ర కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి పాల్గొని... కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న నినాదంతో... పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు.
కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు: కారం రవీందర్ రెడ్డి - హైదరాబాద్ వార్తలు
కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమలను అభివృద్ధి చేస్తూ... నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో జరిగిన కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు: కారం రవీందర్ రెడ్డి
కేటీఆర్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నారని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఐటీ, పరిశ్రమలను అభివృద్ధి చేస్తూ... నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని ప్రశంసించారు.