తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR On Pattana Pragathi Programme : 'సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధే.. తెలంగాణ నమూనా' - శిల్పా కళావేదికలో పట్టణ ప్రగతి కార్యక్రమం

KTR Excellent Speech On Pattana Pragathi Program : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్నమాట ఎంత నిజమో.. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు పట్టణాలు కూడా అంతే ముఖ్యమన్న మాట వాస్తవమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. సీఎం కేసీఆర్​ ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వివరించారు. హైదరాబాద్​లోని శిల్పకళావేదికలో జరిగిన పట్టణ ప్రగతి వేడుకల్లో మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు.

KTR
KTR

By

Published : Jun 16, 2023, 8:16 PM IST

KTR Attended Pattana Pragathi Programme At Shilpakalvedika : సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధే తెలంగాణ నమూనా అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఈ నాలుగు పదాల్లోనే తెలంగాణ అభివృద్ధిని చెప్పొచ్చని తెలిపారు. హైదరాబాద్​లోని శిల్పకళావేదికలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పట్టణ ప్రగతి వేడుకల్లో మంత్రి కేటీఆర్​ ముఖ్య అతిథిగా పాల్గొని.. ప్రసంగించారు.

సీఎం కేసీఆర్​ ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ వివరించారు. టీఎస్​ఐపాస్​ తరహాలో టీఎస్​బీపాస్​ తీసుకువచ్చి.. స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణానికి అవకాశం ఇచ్చారన్నారు. 2021-22 ఏడాదిలో తెలంగాణకు కేంద్రం నుంచి 12 అవార్డులు రాగా.. మరి 2022-23వ సంవత్సరం అందుకు రెండు రెట్లు ఎక్కువ వచ్చాయని కేటీఆర్​ తెలిపారు. మున్సిపల్ శాఖలో ఉన్న ఉద్యోగులందరికీ మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు.

KTR Speech On Pattana Pragathi Programme : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్నమాట ఎంత నిజమో.. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు పట్టణాలు కూడా అంతే ముఖ్యమన్న మాట వాస్తవమని మంత్రి కేటీఆర్​ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్​లో దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు నివాసం ఉంటున్నారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్​ నాయకత్వంలో ఇటు పల్లెలు, అటు పట్టణాలు ఒకేదారిలో అభివృద్ధి చెందుతున్నాయని హర్షించారు.

దేశానికే దిక్సూచి తెలంగాణ : 9 ఏళ్లలో ఏం సాధించారని.. దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.. వారందరికీ ఒకే సమాధానం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధే అందుకు నిదర్శనమని గర్వంగా చెప్పారు. దేశంలో 40 శాతం ఐటీ ఉద్యోగాలు కేవలం తెలంగాణ నుంచి మాత్రమే వస్తున్నాయన్నారు. మరోవైపు వ్యవసాయ ఎగుమతులు.. ఐటీ ఎగుమతులు కూడా పెరిగాయన్నారు. కేవలం 9 ఏళ్లలోనే దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిచిందంటే.. కేవలం సీఎం కేసీఆర్​ మాత్రమే కాదు.. రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక కారణమని మంత్రి కేటీఆర్​ కొనియాడారు.

"ఇప్పుడు రాష్ట్రం ఏం చేస్తే.. రేపు దేశం దాన్ని అనుసరిస్తోంది. త్వరలోనే రూ.71 కోట్లతో స్వేచ్ఛ బడిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాము. అందుకు సంబంధించిన నిధులను వెంటనే కేటాయిస్తాం. 14వేల పబ్లిక్​ టాయిలెట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే చక్కటి నిద్ర వనాలను కూడా ఏర్పాటు చేసుకున్నామని" - కేటీఆర్, రాష్ట్ర మంత్రి

Pattana Pragathi Programme In Hyderabad : నగరంలో ఎల్బీనగర్​ వంటి పలు ప్రదేశాల్లో అభివృద్ధి కొట్టొచ్చినట్లు అందరికీ కనిపిస్తోందని కేటీఆర్​ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా నగరంలో చాలా నాలాలు బాగు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని.. దానిపై దృష్టి సారిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మూసీ నదిపై కొత్తగా 14 బ్రిడ్జిలు కట్టే ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రతి పట్టణంలో కచ్చితంగా మినీ స్టేడియం కట్టాలనే ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

'సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధే.. తెలంగాణ నమూనా'

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details