రాష్ట్రాలను బలోపేతం చేయడం ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దిల్లీలో ప్రధాని నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని కోరిన ఐదు అంశాలపై తమ అభిప్రాయాలను వివరించామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర అధికారాల వికేంద్రీకరణ ద్వారా సమాఖ్య వ్యవస్థ పటిష్ఠం అవుతుందని తెలిపినట్లు పేర్కొన్నారు. జమిలి ఎన్నికలకు తెరాస ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఒకేసారి ఎన్నికల నిర్వహించడం ద్వారా ధన ప్రవాహాన్ని అడ్డుకోవచ్చని అన్నారు.
'రాష్ట్రాల బలోపేతంతోనే దేశాభివృద్ధి' - కేటీఆర్ అఖిల పక్ష సమావేశం
జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. నయాభారత్ నిర్మాణానికి తమ విధానాలను కేంద్రానికి వివరించామని తెలిపారు.
కేటీఆర్