KTR At Malakpet IT Park Opening బీఆర్‌ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో కానీ.. బీజేపీది మాత్రం అదానీ చేతిలో KTR At Malakpet IT Park Opening : బీఆర్‌ఎస్ స్టీరింగ్కేసీఆర్ చేతిలో, ఎమ్‌ఐఎమ్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందని... కానీ ప్రధాని స్టీరింగ్ అదానీ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఐటీ రంగంలో బెంగళూరు తరువాత తెలంగాణలోనే అధిక ఉద్యోగాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ మలక్‌పేటలో ఐటీ న్యూక్లియస్ ఐటీ పార్కుకు ఎంపీ అసదుద్దీన్, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలతో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 30 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 12 ఎకరాల్లో 15 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ టవర్ల నిర్మాణం పూర్తయితే 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Minister KTR Tour in Ramagundam : కేసీఆర్ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం: కేటీఆర్
మరోవైపు.. ఓల్డ్ సిటీలో యువతకు ఉపాధి కల్పించాలనే తన కల నెరవేరబోతోందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఐకానిక్ భవనం పాత నగరానికే తలమానికంగా మారుతుందని హర్షం వ్యక్త చేశారు. దీని ద్వారా పాత-కొత్త నగరాల మధ్య అంతరం తొలగిపోతుందని చెప్పారు. యువతకు ఉద్యోగ కల్పన కోసం తాము చేసిన విజ్ఞప్తికి స్పందించి మలక్ పేటలో ఐటీ పార్కు నిర్మాణానికి సహకరించిన మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే బలాలా కృతజ్ఞతలు తెలిపారు.
Minister KTR Fires on Governor Tamilisai : 'గవర్నర్ మనసుతో ఆలోచించి ఉంటే.. తిరస్కరించేవారు కాదు'
ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. తెలంగాణ అభివృద్ధిపైన ప్రసంగించారు. మూసీనది ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిందని.. దాని ఉత్పత్తిలో పంజాబ్, హరియాణాను అధిగమించామని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం పూర్తి చేశామని... దానికి కేంద్రం ఒక్క రుపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో రాష్ట్రంలో తరచూ కర్ఫ్యూ పరిస్థితులుండేవని.. కేసీఆర్ పాలనలో తొమ్మిదేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని కేటీఆర్ చెప్పారు.
KTR At Malakpet IT Park Opening బీఆర్‌ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో కానీ.. బీజేపీది మాత్రం అదానీ చేతిలో ఉంది KTR Distributed 162 Vehicles for Dalit Bandhu Candidates: అంతకుముందు హైదరాబాద్‌లో ఆంబేడ్కర్ విగ్రహం దగ్గర జెండా ఊపీ 162 స్టీల్ కార్టింగ్ వాహనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దళిత బంధు కింద మురుగు వ్యర్థాల 162 రవాణా వాహనాలను రూ.1.94కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని తెలిపారు. దళిత బంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారని అన్నారు. భవిష్యత్‌లో అర్హులందరికీ దళిత బంధు ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటుదని వివరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు.
Lake Front Park Opening Hyderabad Today : హుస్సేన్‌సాగర్ వద్ద సరికొత్త అందాలు.. నేడే 'లేక్ ఫ్రంట్ పార్కు' ప్రారంభోత్సవం
KTR Laid Foundation Eurofins Campus : 'ఉపాధి, ఉద్యోగ కల్పన, సంపదను సృష్టించటమే నేతల ముందున్న సవాల్'