KTR at LBnagar BRS Booth Committees Meeting కాంగ్రెస్ పార్టీ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, మతకల్లోలాలు KTR at LB Nagar BRS Booth Committees Meeting :ఎన్నికల్లో పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అవుతానని అంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) విమర్శించారు. జానారెడ్డే కాదు భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్, జగ్గారెడ్డి కూడా సీఎం అవుతామని అంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఏడుగురు ముఖ్యమంత్రులు అవుతామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 2018లో కేసీఆర్ ఓడిపోతారని సర్వేల పేరుతో ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. 25 సీట్లు ఎక్కువ ఇచ్చి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఓడిపోతారంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. ఈసారి కూడా 2018 ఫలితాలే పునరావృతం అవుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
BRS Booth Committees Meeting in LBnagar :ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ బూత్ కమిటీల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. నాగోల్ నుంచి ఎల్బీనగర్‌కు మెట్రోను కలుపుతూ పెద్దఅంబర్‌పేట్ వరకు మెట్రో సేవలు విస్తరిస్తామని చెప్పారు. అలాగే ఎల్బీనగర్ నుంచి శంషాబాద్‌కు వెళ్లేందుకు కూడా మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి రజనీకాంత్(Rajani Kanth on Telangana Development) ప్రశంసించారని గుర్తు చేశారు. 20 ఏళ్ల తర్వాత వచ్చిన తాను హైదరాబాద్‌లో ఉన్నానా.. న్యూయార్క్‌లో ఉన్నానా అని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. సినిమా తారలు రజనీకాంత్, సన్నీ డియోల్, లయ.. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ అభివృద్ధిని ప్రశంసిస్తున్నారని మంత్రి హర్షం చేశారు.
KTR Reacts on Pravaika Incident : ప్రవళిక మరణంపై స్పందించిన కేటీఆర్.. కుటుంబ సభ్యులను ఆదుకుంటామన్న మంత్రి
కర్ణాటకలో 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారన్న మంత్రి.. కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రజల్లో చైతన్యం నింపుతున్నారన్నారు. కర్ణాటకలో కరెంట్ కోతలు ఉన్నాయని ఇక్కడి ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పుచేశామని కర్ణాటక రైతులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. 2014కు ముందు విద్యుత్ సరఫరా ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గుర్తించాలని కోరారు. 2014కు ముందు కరెంట్ కోతల గురించి అడిగితే పట్టించుకునే నాథుడే లేడని ఆరోపించారు. ఇప్పుడు ఏదైనా సమస్య వల్ల 10 నిమిషాలు కరెంట్ నిలిచిపోతే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తున్నారని అన్నారు.
Minister KTR Fires on Congress :కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థను ఎలా తీర్చిదిద్దారో ప్రజలు ఆలోచించాలని మంత్రి సూచించారు. కర్ణాటకలో పారిశ్రామిక వేత్తలు, రైతులు రోడ్లు ఎక్కి నిరసనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని రేవంత్‌రెడ్డి ప్రచారానికి తీసుకువచ్చారన్న మంత్రి.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అక్కడి విద్యుత్ సరఫరాపై వికారాబాద్ జిల్లాలో వివరించారన్నారు. కర్ణాటకలో కష్టపడి 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారని వివరించారు. 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రానికి వచ్చి కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామంటే అందరూ ముక్కున వేలేసుకున్నారని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, మతకల్లోలాలని మండిపడ్డారు. 2014లో ఎల్బీనగర్ చౌరస్తా ఎట్లుండే.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు.
BRS Launch KCR Bharosa Campaign : 'జనంలోకి 'కేసీఆర్ భరోసా'.. మళ్లీ గెలిస్తే కచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు''
KTR Meeting with War Room Incharges : "సర్వేలన్ని బీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నాయ్"