2014లో కేటీఆర్ ఆస్తులు 8 కోట్లని.. 2018 ఎన్నికల నాటికి ఆస్తుల విలువ 41 కోట్లకు ఎలా పెరిగాయో చెప్పాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ జన్వాడ్‌లో 25 ఎకరాల స్థలంలో ఇంధ్రభవనం నిర్మిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీకి అర్హుడని ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలను ఎందుకు మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేంద్రర్ సమర్థించడం లేదన్నారు. వారు అనుకూల ప్రకటన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఎలా పెరిగాయి' - కేటీఆర్ ఆస్తులపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆస్తులు ఎలా 425 శాతం పెరిగాయో చెప్పాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ పుర ఎన్నికల తరువాత మంత్రి ఆస్తులను ఆధారాలతో సహా బయట పెడతానని వెల్లడించారు.
'కేటీఆర్ ఆస్తులు 400 శాతం ఏలా పెరిగాయి'
తెరాసలో ఉద్యమ ద్రోహులు, ఉద్యమ కారులు రెండు జట్లుగా విడిపోయారన్నారు. కేటీఆర్‌కు అనుకూలంగా ఉద్యమ ద్రోహులు, ప్రజల పక్షాన ఉద్యమకారులు ఉన్నారన్నారు. మున్సిపల్ ఎన్నికలకు నా పనితీరుకు గీటురాయి అంటున్న కేటీఆర్‌కు ఇందుకు హరీశ్‌రావు అనుమతి ఉందా అని ప్రశ్నించారు. ఫిర్జాదిగూడ తెరాస నేత కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. తెరాసలో ముసలం మొదలైందని అన్నారు.
ఇదీ చూడండి : 'తెరాసకు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే...'
Last Updated : Jan 13, 2020, 5:51 AM IST