బ్లాక్ ఫంగస్ ఔషధాలు కావాలంటే మెయిల్ చేయండి: కేటీఆర్ - తెలంగాణ వార్తలు
05:37 May 20
బ్లాక్ ఫంగస్ ఔషధాలు కావాలంటే మెయిల్ చేయండి: కేటీఆర్
బ్లాక్ ఫంగస్ ఔషధాలు అవసరమైనవారు డీఎంఈకి మెయిల్ చేసి పొందవచ్చని మంత్రి కేటీఆర్ సూచించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అంఫోటెరిసిన్ ఔషధం కావాల్సినవారు సంబంధిత వైద్యుని ప్రిస్క్రిప్షన్‌తో కలిసి ఈమెయిల్ పంపించాలన్నారు. దాన్ని పరిశీలించి అవసరమైన వారికి ఇంజక్షన్లు సమకూరుస్తామని కేటీఆర్ ట్విట్టర్‌లో తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పలువురు బాధితుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు.. ఇంజక్షన్లు కోరగా ఈ సమాచారం పంచుకున్నారు. కరోనాతో కోలుకున్నవారికి బ్లాక్ ఫంగస్ నిర్ధరణ అయితే కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిలో చేరాలని సూచించారు. కరోనా ఉన్నప్పుడు బ్లాక్ ఫంగస్ వస్తే గాంధీలో చికిత్స ఉందని వివరించారు.