గ్లోబరీనా సంస్థకు తన మద్దతు ఉందన్న ప్రచారం పూర్తిగా అవాస్తమని... ఇంటర్ ఫలితాల వివాదం తలెత్తే వరకూ ఆ పేరే వినలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంటర్ ఫలితాల్లో తప్పులకు బాధ్యులైన వారిని ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర ఆవేదన కలిగించాయని... ఒక తండ్రిగా బాధను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. ఇంటర్ బోర్డును రద్దు చేసి.. పన్నెండో తరగతి వరకు ఒకే గూటికి చేర్చాలన్న ఆలోచనలపై నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలివేస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో నెటిజన్లు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు.
రాజ్యాంగేతర శక్తి ఎలా అవుతుంది
ప్రభుత్వంలో ఓ హోదా లేకపోయినప్పటికీ.. సర్కారు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని.. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారా అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ వివరణ ఇచ్చారు. సమస్యలను పరిష్కరించాలని... ఓ ప్రజా ప్రతినిధిగా అధికారులను కోరితే తప్పేంటని... దానివల్ల ఎవరికి ఇబ్బందని కేటీఆర్ ప్రశ్నించారు. నిజామాబాద్లో రైతుల నామినేషన్ల వెనుక... భాజపా, కాంగ్రెస్ రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. కేంద్రంలో రాబోయే స్నేహపూర్వక ప్రభుత్వం ద్వారా... పసుపుబోర్డును సాధిస్తామన్నారు. నిజామాబాద్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని... రాష్ట్రంలో 16 స్థానాల్లో విజయం తెరాసదేనని ధీమా వ్యక్తం చేశారు.
మా వాళ్లను చేర్చుకున్నారు కదా