తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Anger Over PM Modi Comments in Nizamabad : కేసీఆర్ ఒక ఫైటర్‌... చీటర్‌తో కలవరు: మంత్రి కేటీఆర్‌ - ప్రధాని మోదీ నిజామాబాద్​ పర్యటనపై కేటీఆర్​ ఫైర్​

KTR Anger Over PM Modi Comments in Nizamabad : కేసీఆర్​ ఒక ఫైటర్​.. చీటర్​తో కలవరని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్​ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్టీడీఏలో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితినే లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్టీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశాయన్నారు. హైదరాబాద్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్​.. ఈ మేరకు ప్రధాని మోదీ, ఎన్డీఏ కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

KTR Anger Over PM Modi
KTR Anger Over PM Modi Comments in Nizamabad

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 7:34 PM IST

Updated : Oct 3, 2023, 8:24 PM IST

KTR Anger Over PM Modi Comments in Nizamabad : కేసీఆర్​ ఒక ఫైటర్​.. చీటర్​తో కలవరని ప్రధాని మోదీ(PM Modi)ని ఉద్దేశిస్తూ బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR Fires on PM Modi)​ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్​ జుమ్లా పార్టీ ఇన్​ ఇండియానని విమర్మించారు. ఎన్టీడీఏ(NDA)లో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితినే లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్టీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశాయన్నారు. హైదరాబాద్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్​.. ఈ మేరకు ప్రధాని మోదీ, ఎన్డీఏ కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ప్రధానమంత్రి మోదీ యాక్టింగ్​కు ఆస్కార్​ తప్పక వస్తుందని.. ఇదే స్కిప్టు రాస్తే సినిమాకి ఇస్తే బాగా విజయవంతం అవుతుందని మంత్రి కేటీఆర్​ ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమిలో ఎవరూ కలవాలని అనుకునే పరిస్థితి లేదని.. ఆ కూటమిలో చేరేందుకు తామేమైనా పిచ్చికుక్కలమా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్డీఏను వీడి బయటికి వచ్చేశాయని గుర్తు చేశారు. బీజేపీతో దోస్తీ ఎలా ఉంటుందో టీడీపీ, ఎస్​ఏడీ చూశాయని అన్నారు. ప్రస్తుతం ఎన్డీఏలో సీబీఐ, ఈడీ, ఐటీ మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్డీఏను వీడిన పార్టీలపైకి ఈడీ, సీబీఐలను పంపుతున్నారని మండిపడ్డారు.

PM Modi Speech at BJP Public Meeting in Nizamabad : 'బీఆర్​ఎస్​ దోచుకున్నది అంతా మళ్లీ ప్రజల ముందు ఉంచుతా'

Minister KTR Comments on PM Modi :"బీజేపీలో చేరిన నేతలను దర్యాప్తు సంస్థలు వదిలేస్తాయి. ఎన్టీఏ మునిగిపోయే నావ.. అది ఎక్కాలని ఎవరూ అనుకోరు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం ఇచ్చారని ఓట్లు అడుగుతున్నారు. బీజేపీలో చేరిన వారిపై ఉన్న కేసులు మరుగున పడిపోతున్నాయి. నేను సీఎం కావడానికి మోదీ అనుమతి అక్కర్లేదు. 70 ఏళ్ల వయసులో మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారు. అబద్ధాలతో ప్రధాని పదవి గౌరవాన్ని మోదీ తగ్గించారని" మంత్రి కేటీఆర్​ ధ్వజమెత్తారు.

KTR Tweet on PM Modi : 'మోదీ జీ.. మా 3 ప్రధాన హామీల సంగతేంటి?'

"ఎన్ని అబద్ధాలు చెప్పిన.. ఎన్ని ప్రేలాపనలు పేలిన.. కేసీఆర్​ ఒక ఫైటర్​.. చీటర్స్​తో ఎప్పటికీ చేతులు కలపరు. ఎన్డీఏతో చేరాల్సిన కర్మ మాకు పట్టలేదు. అది మునిగిపోయే నావా. తెలుగుదేశం, శిరోమణి అకాళీదళ్​, జేడీయూ, శివసేన వదిలేసింది. అయినా ఎన్డీఏలో ఉన్నది ఎవరూ.. సీబీఐ, ఈడీ, ఐటీ తప్ప ఎన్డీఏలో పార్టనర్స్​ ఎవరు ఉన్నారు. ఎన్డీఏలో చేరడానికి తామకు ఏం పిచ్చికుక్క కరవలేదు. రాహుల్​గాంధీ వచ్చి బీజేపీకి బీ టీం అంటారు. ఈయన వచ్చి కర్ణాటకలో కాంగ్రెస్​కు పైసలు పంపామని అంటున్నారు. చివరి వరకు బీజేపీతో నిలబడి కొట్లాడుతాం."- కేటీఆర్​, మంత్రి

PM Modi Nizamabad Tour KTR Comments :మీడియాను ఎదుర్కొనే ధైర్యం కూడా ప్రధాని మోదీకి లేదని మంత్రి కేటీఆర్​ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ప్రధాని చేసిన పసుపు బోర్డు ప్రకటన.. అదో పెద్ద జోక్​ అని విమర్శించారు. హామీ ఇచ్చిన 9 ఏళ్లకు ప్రకటన చేసి వెళ్లారన్నారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు అవుతుందని.. ఏం ఇచ్చారని ఓట్లు అడుగుతున్నారన్నారు. డీలిమిటేషన్​పై విస్తృత చర్చ జరగాల్సి ఉందని.. యూపీ, బిహార్​ వంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారని ఆందోళన చెందారు. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయని హర్షించారు. డీ లిమిటేషన్​పై భవిష్యత్​లో తమ పార్టీతో కలిసివచ్చే రాష్ట్రాలతో చర్చిస్తామని మంత్రి కేటీఆర్​ చెప్పారు.

KTR Anger Over PM Modi Comments in Nizamabad కేసీఆర్ ఒక ఫైటర్‌... చీటర్‌తో కలవరు: మంత్రి కేటీఆర్‌

KTR Comments on PM Modi : 'రాష్ట్రానికి వచ్చి ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేశారు'

Minister KTR Tour in Ramagundam : కేసీఆర్​ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం: కేటీఆర్

Last Updated : Oct 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details