తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏపీ మంత్రి వెల్లంపల్లిని పదవి నుంచి బర్తరఫ్​​ చేయాలి' - ap minister vellampally srinivas latest news

ఆంధ్రప్రదేశ్​ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్​​ చేయాలని క్షత్రియ సేవా సమితి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. రామతీర్థం ఘటనపై ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్​లో ఆందోళన కార్యక్రమం చేపట్టింది.

kshatriya-seva-samiti-demond-to-ap-government-to-minister-vellampalli-srinivas-should-be-sacked-immediately
'ఏపీ మంత్రి వెల్లంపల్లిని పదవి నుంచి బర్తరఫ్​​ చేయాలి'

By

Published : Jan 5, 2021, 2:09 PM IST

రామతీర్థం ఘటనపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండిస్తూ హైదరాబాద్​లోని కుషాయిగూడలో తెలుగు రాష్ట్రాల క్షత్రియ సేవా సమితి, సూర్య యూత్ అసోసియేషన్​ సభ్యులు ఆందోళన చేపట్టారు. హెచ్​బీ కాలనీలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, దేవాలయ బోర్డు మాజీ ఛైర్మెన్​ అశోక్ గజపతిరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టారు.

దేవాలయాల అంశంలో 40 ఏళ్ల అనుభవం కలిగిన అశోక్ గజపతిరాజుపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్నినిరసనకారులు తీవ్రంగా ఖండించారు. వెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్​ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చెయ్యాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: ప్రియురాలిని కాల్చిచంపి- ప్రియుడూ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details