తెలంగాణ

telangana

ETV Bharat / state

కేఆర్‌ఎంబీ ఆర్ఎంసీ కమిటీ భేటీ మరోసారి వాయిదా - KRMB Committee Meeting postponed

KRMB RMC Committee Meeting: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆర్ఎంసీ కమిటీ సమావేశాన్ని అధికారులు మరోమారు వాయిదా వేశారు. శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో తమకు వీలు కాదని, సమావేశాన్ని వాయిదా వేయాలన్న తెలంగాణ అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

కేఆర్‌ఎంబీ ఆర్ఎంసీ కమిటీ భేటీ మరోసారి వాయిదా
కేఆర్‌ఎంబీ ఆర్ఎంసీ కమిటీ భేటీ మరోసారి వాయిదా

By

Published : Sep 2, 2022, 12:57 PM IST

KRMB RMC Committee Meeting: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆర్ఎంసీ కమిటీ సమావేశం మరోమారు వాయిదా పడింది. జల విద్యుత్ ఉత్పత్తి, వరద జలాల వినియోగం అంశాలపై చర్చ, రూల్ కర్వ్స్ కోసం సిఫార్సులతో కూడిన ముసాయిదా నివేదికపై చర్చించేందుకు గత నెల 23న జరగాల్సిన కమిటీ సమావేశం ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తితో నేటికి వాయిదా పడింది. అయితే శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో తమకు వీలు కాదని, సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ అధికారులు బోర్డును కోరారు.

ఫలితంగా కేఆర్ఎంబీ అధికారులు సమావేశాన్ని ఈ నెల ఐదో తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు కూడా సమావేశం జరిగే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కార్యక్రమం, మంత్రివర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో ఐదో తేదీన తమకు వీలు కాదని, ఏడో తేదీ తర్వాత ఆర్ఎంసీ సమావేశాన్ని నిర్వహించాలని తాజాగా ఆంధ్రప్రదేశ్ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ ఈఎన్సీ లేఖ రాశారు. దీంతో తదుపరి సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details