తెలంగాణ

telangana

ETV Bharat / state

'అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను తక్షణమే నిలిపివేయాలి' - KRMB letter to telugu states

'అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను తక్షణమే నిలిపివేయాలి'
'అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను తక్షణమే నిలిపివేయాలి'

By

Published : Jul 15, 2022, 7:05 PM IST

Updated : Jul 15, 2022, 7:56 PM IST

19:03 July 15

'అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను తక్షణమే నిలిపివేయాలి'

అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను తక్షణమే నిలిపివేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. కేంద్రం గతంలో ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ గడువు పూర్తయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాసిన బోర్డు.. ఈ విషయాన్ని పేర్కొంది. ప్రాజెక్టుల అనుమతులకు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన గడువు ఈనెల 13తో ముగిసింది. ఈ నేపథ్యంలో పనులు నిలిపి వేయాలని స్పష్టం చేస్తూ బోర్డు ఏపీ, తెలంగాణకు లేఖలు రాసింది. అనుమతుల్లేని ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయని కేఆర్‌ఎంబీ పేర్కొంది.

గతేడాది జులై 15న కేంద్ర జలశక్తిశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం రెండు రాష్ట్రాలు అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులు ఆపివేయాలని తెలిపింది. ఆదేశాలపై తగిన నివేదికలు ఇవ్వాలని నిరుడు జులైతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రెండు రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు గుర్తు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై చాలా వివాదాలు ఉన్నాయన్న బోర్డు.. రెండు ప్రాజెక్టులకు చెందిన 15 కాంపొనెంట్లను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయం జరిగినట్టు పేర్కొంది. 15వ కేఆర్ఎంబీ సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరిందని... కాంపొనెంట్ల స్వాధీనానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. బోర్డు తీసుకున్న ఈ కీలక నిర్ణయం అమలైతే వివాదాస్పద అంశాలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని పేర్కొంది.

ఇవీ చూడండి..

గోదావరి మహోగ్రరూపం... 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డు బ్రేక్

మంకీపాక్స్ తొలి కేసు నమోదు.. అప్రమత్తమైన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ

Last Updated : Jul 15, 2022, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details