KRMB Committee Meeting: జల విద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాల రూపకల్పన సహా వరద నీటి లెక్కలు, రూల్ కర్వ్స్ అంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ మరోమారు సమావేశమైంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన జలాశయాల నిర్వహణా కమిటీ సమావేశంలో రూల్ కర్వ్స్ విషయమై చర్చించారు. రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు. వాటికి అనుగుణంగా మరోమారు సమావేశం కావాలని గతంలో నిర్ణయించారు.
జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం.. వాటిపైనే ప్రధానంగా చర్చ..! - KRMB Meeting
KRMB Committee Meeting: హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు సమావేశానికి హాజరయ్యారు. వరద జలాల లెక్కింపుపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.
జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం.. వాటిపైనే ప్రధానంగా చర్చ..!
అందుకు అనుగుణంగానే హైదరాబాద్ జలసౌధ వేదికగా కమిటీ ఇవాళ మరోమారు భేటీ అయింది. కేఆర్ఎంబీ సభ్యుడు రవి కుమార్ పిళ్లై కన్వీనర్‌గా ఉన్న కమిటీలో బోర్డు సభ్యుడు మౌంతాంగ్, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, రెండు రాష్ట్రాల జెన్కో అధికారులు వెంకటరాజం, సృజయకుమార్ ఉన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి కోసం విధివిధానాలు, రూల్ కర్వ్స్, వరదజలాల లెక్కింపు అంశాలపై కమిటీ చర్చిస్తోంది.