ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీల్లో భాగంగా ఒప్పంద ఉపాధ్యాయులందరినీ క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 132 డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 863 మంది అతిథి అధ్యాపకులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం స్పందించక పోతే ఉన్నత విద్యామండలికి తాళం వేస్తామని హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల్లో వచ్చేనెల 11 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
'వచ్చేనెల 11వరకు మద్యం షాపులు మూసేయాలి' - guest lecturer salaries
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేశాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తెలంగాణలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

బీసీల హక్కుల్ని కాపాపండి