ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని సప్తనదుల సంగమేశ్వర పురాతన ఆలయ శిఖర భాగానికి ఆదివారం కృష్ణమ్మ నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తడం వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.
సంగమేశ్వర ఆలయ శిఖరానికి చేరిన కృష్ణమ్మ
ఏపీ కర్నూలు జిల్లాలోని సప్తనదుల సంగమేశ్వర పురాతన ఆలయ శిఖర భాగానికి ఆదివారం కృష్ణమ్మ నీరు చేరింది.
అయితే సంగమేశ్వర దేవాలయం, కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశంగా ఆలయానికి ప్రసిద్ధి ఉంది. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించడం ఈ ఆలయం ప్రత్యేకత. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు