తెలంగాణ

telangana

ETV Bharat / state

Krishna Tribunal Judgement on Palamuru Rangareddy Project : పాలమూరు ప్రాజెక్ట్ నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

Krishna Tribunal Judgement on Palamuru Rangareddy Project : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ 90 టీఎంసీల నీరు వాడకుండా ఆపాలని వేసిన పిటిషన్​ను కృష్ణా ట్రైబ్యునల్‌ కొట్టివేసింది. ఈ తీర్పుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి స్పందించారు. ఇది పాలమూరు విజయమని హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రాజెక్ట్​లో ఉన్న అడ్డంకులని కేంద్ర ప్రభుత్వం గుర్తించి తొలగించాలని డిమాండ్ చేశారు.

Krishna Tribunal Judgement on Palamuru Project
Niranjan Reddy Reaction on Palamuru Project

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2023, 7:05 PM IST

Updated : Sep 20, 2023, 7:17 PM IST

Krishna Tribunal Judgement on Palamuru Rangareddy Project : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలపై ఏపీ ఇంటర్‌లొకేటరీ వేసిన అప్లికేషన్​పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ 90 టీఎంసీల నీరు వాడకుండా ఆపాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై విచారణ అధికారం తమకు లేదని కృష్ణా ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది.

2022 ఆగస్టులో తెలంగాణ ఇచ్చిన జీవో 246పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు వేసింది. దీంతో ట్రైబ్యునల్‌లో జులై 14 వరకు వాదనలు జరిగాయి. ఇవాళ ఈ అంశంపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తుది ఉత్తర్వులు వెల్లడించింది. ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై విచారణ అధికారం తమకు లేదని.. తగిన వేదికలను ఆశ్రయించాలని తుది ఉత్తర్వుల్లో ట్రైబ్యునల్‌ పేర్కొంది.

Niranjan Reddy on Palamuru Rangareddy Project : పాలమూరుకు తీరనున్న కష్టాలు.. త్వరలోనే సాగునీళ్లు

Niranjan Reddy Reaction on Tribunal Judgement : పాలమూరు ప్రాజెక్ట్​పై కృష్ణా ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పు(Krishna Tribunal Judgement)పై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పందించారు. ఇది పాలమూరు విజయంగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుపై ఏపీ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై కృష్ణా ట్రెబ్యునల్‌ తీర్పును మంత్రి స్వాగతించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(Palamuru-Ranga Reddy lift Irrigation Project)కు 90టీఎంసీల వరకు కృష్ణా జలాలు తీసుకోవచ్చని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డిఎత్తిపోతల పథకానికి ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ, మోటా, కేంద్ర భూగర్భ జలశాఖ, విద్యుత్‌ ప్రాధికార సంస్థ, కేంద్ర మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ లాంటి సంస్థల అన్ని రకాల అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. ట్రెబ్యునల్‌ తీర్పు ద్వారా సబ్ జ్యూడిస్ అడ్డంకి తొలగిపోయిందని అన్నారు. ఈ ప్రాజెక్టులో ఉన్న మరిన్ని అడ్డంకులను కేంద్ర ప్రభుత్వ గుర్తించి వీలైనంత త్వరగా తొలగించాలని కోరారు. కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాను కూడా వెంటనే తేల్చాలన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో సీఎం కేసీఆర్‌ పట్టుదలే ఈ విజయానికి కారణమని తెలిపారు.

"ఏపీ కేసు కొట్టివేసిన కృష్ణ ట్రెబ్యునల్‌ తీర్పు హర్షనీయం. ఇది పాలమూరు విజయం. ట్రెబ్యునల్‌ తీర్పు ద్వారా సబ్ జ్యూడిస్ అడ్డంకి తొలగిపోయింది. పాలమూరు ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను కేంద్రం గుర్తించి తొలగించాలి. కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటా వెంటనే కేంద్రం తేల్చాలి." - సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

మరోవైపు బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ అధికారులు పరిశీలిస్తున్నారు. తుది కాపీని పరిశీలించిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై వారు ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

Palamuru Rangareddy Lift Irrigation Project : పాలమూరు-రంగారెడ్డితో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 1200పైగా గ్రామాలకు తాగునీరు

Niranjan Reddy on Palamuru Rangareddy Project : 'ఈ శతాబ్దపు అతి పెద్ద విజయం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు'

Niranjan Reddy Review on Monsoon Crops : 'స్వల్పకాలిక పంటల సాగుపై రైతులను చైతన్యం చేయండి'

Last Updated : Sep 20, 2023, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details