తెలంగాణ

telangana

ETV Bharat / state

Krishna Tribunal Hearing in SC: '48 గంటల్లోపు అఫిడవిట్‌ దాఖలు చేయండి'

కృష్ణా ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరగనుంది. డిసెంబర్​ 13 నుంచి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేయనుంది. విచారణకు 48 గంటల్లోపు కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Krishna Tribunal Hearing in SC
కృష్ణా ట్రైబ్యునల్​పై సుప్రీం విచారణ

By

Published : Nov 29, 2021, 2:34 PM IST

కృష్ణా ట్రైబ్యునల్‌ అంశంపై దాఖలైన పిటిషన్లపై డిసెంబర్‌ 13 నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కృష్ణా ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలపై పిటిషన్లు దాఖలవగా.. జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

కృష్ణా ట్రైబ్యునల్‌ అంశంపై వాదనలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని త్రిసభ్య ధర్మాసనం 4 రాష్ట్రాలను ఆదేశించింది. 3 పేజీలకు మించకుండా వాదనల వివరాలు ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. విచారణకు 48 గంటల్లోపు కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి:KRMB LETTER : తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ

ABOUT THE AUTHOR

...view details