KRMB RMC Meeting in Hyderabad today : హైదరాబాద్ జలసౌధలో ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. కన్వీనర్ ఆర్కే పిళ్లై నేతృత్వంలో కమిటీ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో కేఆర్ఎంబీ సభ్యుడు మౌంతాంగ్ పాల్గొన్నారు. సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి, ఏపీ జెన్‌కో సీఈ సుజయ్‌కుమార్, అధికారులు హాజరయ్యారు. కానీ తెలంగాణ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఇదే చివరి సమావేశమని గతంలో ఆర్‌ఎంసీ పేర్కొంది.
కేఆర్ఎంబీ ఆర్‌ఎంసీ భేటీకి తెలంగాణ గైర్హాజరు.. మధ్యాహ్నానికి వాయిదా
KRMB RMC Meeting in Hyderabad today : హైదరాబాద్ జలసౌధలో ఇవాళ మధ్యాహ్నం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. కన్వీనర్ ఆర్కే పిళ్లై నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారులు హాజరు కాకపోవడంతో సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం వరకు తెలంగాణ అధికారులు హాజరు కావాలని సూచించారు.
KRMB RMC Meeting in Hyderabad today
ఈ క్రమంలో తెలంగాణ సభ్యులను ఈ భేటీకి తప్పనిసరిగా హాజరుకావాలని ఆర్‌ఎంసీ కోరింది. మధ్యాహ్నం వరకు హాజరవుతామని తెలంగాణ అధికారులు ఆర్‌ఎంసీకి వివరించారు. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీ భేటీని అధికారులు మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఇవాళ జరగనున్న కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీ సమావేశంలో అధికారులు జల విద్యుదుత్పత్తి, జలాశయాల రూల్ కర్వ్స్‌పై చర్చించనున్నారు. వరద సమయంలో వినియోగించిన జలాల గురించి సమావేశంలో చర్చకు రానుంది.