KRMB member Ravi Kumar Pillai transferred: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యుడు రవి కుమార్ పిళ్లై బదిలీ అయ్యారు. కేఆర్ఎంబీ సభ్యుడుగా ఉన్న ఆయనని.. కేంద్ర జలసంఘం ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా బోర్డు సభ్యుడుగా ఉన్న రవికుమార్ పిళ్లై ఆర్ఎంసీ కన్వీనర్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు.
శ్రీశైలం-నాగార్జునసాగర్ జలాశయాల రూల్ కర్వ్స్, జల విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో జలాల వినియోగం మార్గదర్శకాలపై కసరత్తు చేశారు. గత శనివారం ఆర్ఎంసీ చివరి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ సభ్యులు ఆ రోజు హాజరయ్యారు. శ్రీశైలం రూల్ కర్వ్స్ విషయంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయని పిళ్లై తెలిపారు. సోమవారం జరిగిన సమావేశానికి తెలంగాణ సభ్యులు హాజరుకాలేదు. దీంతో బోర్డు సభ్యులు, ఏపీ సభ్యులు మాత్రమే నివేదికపై సంతకం చేశారు.